తమిళనాడు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ః దిండిగుల్(Dindigul) జిల్లాలోని ఒక కాటన్ మిల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మిల్ పిళ్లయార్‌నాథం ప్రాంతంలో పనిచేస్తోంది. శుక్రవారం రాత్రి కాటన్ మిల్(Cotton Mill)లో మంటలు చెలరేగాయి. వెంటనే కార్మికులు దిండిగుల్ ఫైర్ సిబ్బంది(Fire crew)కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల(Two fire engines) సహాయంతో, ఒక గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అధికారుల ప్రకారం.. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన పత్తి స్టాక్(Cotton stock) ధ్వంసమైంది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అగ్నిప్రమాద కారణాన్ని గుర్తించేందుకు చిన్నలపట్టి పోలీసులు(Chinnalapatti Police) దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గత శనివారం జరిగిన ఇలాంటి సంఘటనలో, తమిళనాడు థూత్తుకుడి జిల్లాలోని థిట్టన్‌కులం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఒక మ్యాచ్‌స్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి, లక్షల రూపాయల విలువైన యంత్రాలు, ముడి సరుకు దెబ్బతిన్నాయని ఓ అధికారి తెలిపారు.

