శంషాబాద్, మార్చి 20 (ఆంధ్రప్రభ) : శంషాబాద్ లోని ఈకేఏఎం కన్వెన్షన్ హాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద ఈకేఏఎం కన్వెన్షన్ హాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. దీంతో హుటాహుటిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి సుమారు రూ.కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. మంటల ధాటికి పొగలు ఆకాశాన్నంటడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
