సనత్‌నగర్‌లోని జింకలవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున ( early hours) 3.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించడంలో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో నల్లని పొగ దట్టంగా అలముకున్నది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్‌ఇంజన్లు, రోబో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద మొ