పింఛన్లతో ఆర్థిక భరోసా

  • కలెక్టర్ చదలవాడ నాగరాణి
  • పశ్చిమలో 2,25,639 మందికి రూ.97.72 కోట్లు సామాజిక పింఛన్ల పంపిణీ

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: సామాజిక పింఛన్లు వృద్ధులకు వితంతువులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం పట్టణం 19వ వార్డు భీమేశ్వర స్వామి ఆలయం పక్క వీధిలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అభయ హస్తం, దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలు, వితంతువులు, నేత కార్మికులు 19వ వార్డులోని మొత్తం 246 మంది లబ్ధిదారులకు రూ.10.98 లక్షల నగదును పంపిణీ చేశారు.

పింఛన్ల పంపిణీ సందర్భంలో జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల క్షేమ సమాచారాన్ని, ఆరోగ్య విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ వాడరాదని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ..జిల్లావ్యాప్తంగా నేడు 20 రకాల పెన్షన్లకు సంబంధించి 2,25,639 మంది లబ్ధిదారులకు రూ.97.72 కోట్లు పంపిణీని ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్, డిఆర్డిఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏపీఓ ఎం.శ్రీనివాస ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, వీఆర్వో జి.లక్ష్మీ కుమారి, వెల్ఫేర్ సెక్రెటరీ మంతెన ఉమా, శానిటేషన్ సెక్రటరీ యు.రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply