Financial | బిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం …

Financial | బిక్షపతి కుటుంబానికి ఆర్థిక సహాయం …
Financial | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పబ్బు బిక్షపతి మరణించగా ఆదివారం జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించి తన వంతుగా రూ. 21500లు ఆర్థిక సాయం చేశారు.
ఈ కార్యక్రమం లో గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, మాజీ సర్పంచ్ చౌట వేణుగోపాల్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు పబ్బతి ఆంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ పబ్బతి వెంకటయ్య, బీజేపీ సీనియర్ నాయకులు పబ్బు కుమార్ గౌడ్, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చౌట శివకుమార్, గంజి లింగేష్, వార్డు సభ్యులు దబ్బటి ఉపేందర్, పార అనసూయ శ్యామ్, కత్తుల సాయికుమార్, రవ్వ పాండరి, ఎస్ కె గాలిబ్, పబ్బతి అంజయ్య, దబ్బడి బాలరాజు, పాలమాకుల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
