మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన రావుల రాములు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఈ రోజు పరామర్శించారు. దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల సంయుక్త కార్యదర్శి మాదనబోయిన పరమేష్,సింగపంగ అశోక్,సింగపంగ ఎల్లయ్య,మేక నవీన్ రెడ్డి,బుర్రి యాదగిరి రెడ్డి, పుల్కరం హనుమంతు,నారగొని యాదయ్య,కుక్కల బాలస్వామి,సింగపంగ యాదయ్య,కట్ట రామకోటి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply