రూ.5 వేల ఆర్థిక సహాయం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డ్ కొండాపురం లో అనారోగ్యంతో మన్నె సత్యనారాయణ నిన్న రాత్రి మృతి చెందారు. మృతుని కుటుంబాన్ని స్థానిక కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్ బుధవారం వారిని పరామర్శించారు.ఈ సందర్భంగా తన వంతుగా రూ. 5వేలు ఆర్థిక సహాయం మృతుని భార్య అండాలు కు స్వయంగా అందజేశారు.మృతుని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
