రూ.లక్ష ఆర్థిక సాయం
గట్టుప్పల (నల్లగొండ జిల్లా), ఆంధ్రప్రభ : నీట్ ర్యాంక్ సాధించిన వెల్మకన్నె గ్రామానికి చెందిన భీమనపల్లి కావ్యకు తేరటుపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత వీరమల్ల శ్రీశైలం ఆర్థిక సాయం అందజేశారు. వెల్మకన్నె గ్రామస్థుడు భీమనపల్లి యాదయ్య కుమార్తె కావ్యకు నీట్ లో 393వ ర్యాంక్ సాధించింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో వైద్య విద్యలో చేరాల్సి ఉండగా చదవటానికి ఆర్థిక పరిస్థితులు అడ్డురావడంతో గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తేరటుపల్లి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల శ్రీశైలం రూ.లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఆదివారం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంబీబీఎస్ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి నిరుపేదలకు సేవ చేయాలని కోరారు.