HELP | అగ్ని ప్రమాద బాధితురాలికి ఆర్థిక సాయం

HELP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : అగ్ని బాధితురాలకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సాయం అందించారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజలి గ్రామ నివాసి లుక్క అంకమ్మ ఐదు రోజుల క్రిందట ప్రమాదవశాత్తు వంట గదిలో వంట చేసుకుంటున్న క్రమంలో గ్యాస్ లీకై మంటలు సంభవించి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు 108 ద్వారా బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా వైద్యశాల భరత్ వైద్యం అందించి 35 శాతం శరీరం కాలినట్లు తెలిపారు. సూప‌రింటెండెంట్‌ సిద్ధార్థ్ ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న లుక్కా రామకృష్ణ 10 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలం చెల్లించారు. అప్పటినుండి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో అంకమ్మకు ఈ దుర్ఘటన జరిగింది.

ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగి ఉంది. పెద్ద పిల్ల భార్గవి డిగ్రీ పూర్తి చేసుకొని పీజీ పెదకాకాని వద్ద యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తుంది. రెండవ సంతానం చైతు ఇంజనీరింగ్ చీరాల కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. పేద కుటుంబం కూలీ పనులు చేసుకునే తల్లి పెద్ద దిక్కు. ఆమె సంపాదనతోనే జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఈ వివరాలు తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు ఏరియా వైద్యశాలకు చేరుకుని వారి వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. బాధితురాలకు తమ వంతుగా సాయం చేయుటకు ముందుకు రావాలని బాపట్ల ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అధ్యక్షులు వెజండ్ల శ్రీనివాసరావు, సభ్యులు బత్తుల సురేష్, జోగి సువర్ణ, కోళ్లపూడి కుమార్, శ్రీరామ్ సునీల్, నరాలశెట్టి నాగరాజు, బొగ్గరపు శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply