Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం..

Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం..

Festiva l మోపిదేవి, ఆంధ్రప్రభః దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పెదకళ్లపల్లిలో స్వయంభుగా కొలువై ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి రథోత్సవం సోమవారం రాత్రి కన్నులవిందుగా జరిగింది. ఆలయ కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామి వారికి విశేష పూజలు చేసి విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేసిన రథంపై స్వామివార్లను ఆసీనులు గావించారు. అనువంశిక ధర్మకర్తలైన చల్లపల్లి రాజవంశీయులు యార్లగడ్డ శివరామ ప్రసాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి తాడు లాగి రథోత్సవమును ప్రారంభించారు. రాజవంశీయులు, ఆలయ అధికారులు రథం ముందు నడుస్తూ పురవీధులలో స్వామివారు గ్రామోత్సవం కొనసాగారు. బాణాసంచా కాల్పులు డప్పు వాయిద్యాలు తీన్మార్ నృత్యాలతో స్వామి వారు పురవీధులలో రథంపై ఊరేగుతుండగా గ్రామస్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Leave a Reply