రూ.2లక్షల ఎరువులు సీజ్…

ఆంధ్రప్రభ, కోడూరు (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా కోడూరు మండలంలో ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బమర్ తో పాటు విజిలెన్స్ సిబ్బంది, మండల వ్యవసాయ శాఖ అధికారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.., కోడూరులోని ఒక ఎరువుల దుకాణంలో బిల్లు బుక్స్, స్టాక్ రిజిస్టర్, ఈపాస్ మిషన్ లో సరిగ్గా లేనందున రూ.2 లక్షల విలువైన 13 టన్నుల ఎరువులు సీజ్ చేసిన‌ట్టు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం. శ్రీధర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎరువుల షాపుల యజమానులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా కోడూరు మండలంలో విజిలెన్స్ అధికారులు 15 రోజుల్లో రెండోసారి తనిఖీలు నిర్వహించటం విశేషం

Leave a Reply