మనసు బాగోలేక..

మనసు బాగోలేక..

జన్నారం,అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ): మనసు బాగాలేక తల్లి 9 నెలల కూతురుతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన ఇది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రేండ్లగూడకు చెందిన చెట్పల్లి స్పందన(24), 9 నెలల కూతురు వేదశ్రీతో ఇంటి దగ్గర ఉన్న వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లి జగిత్యాల జిల్లా సారంగాపూర్ చెందిన బి.రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

మృతురాలకు 4ఏళ్ల మోక్షశ్రీ, 9 నెలల వేదశ్రీ ఇద్దరు ఆడపిల్లలు. మృతురాలు భర్త చెట్పల్లి శ్రావణ్ గుడిపేట టీఎస్ఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. శ్రావణ్ కు స్పందనతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్య భర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా ఆమె మనోవేదనకు గురైందని, ఆ కారణం చేతనే 9 నెలల పాపతో స్పందన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు, మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని మృతురాలు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో తల్లి, కూతురు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి, చిన్నారి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Leave a Reply