Feb6thRelease | బూతు పాటతో చంద్రహాస్ వివాదం.. ప్రమోషన్స్‌పై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్

Feb6thRelease | బూతు పాటతో చంద్రహాస్ వివాదం.. ప్రమోషన్స్‌పై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్

Feb6thRelease | సినిమా ప్రమోషన్స్ కోసమేనా?
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ చేసిన పని ఏంటి?
అసభ్యత వద్దన్న జేడీ చక్రవర్తి స్పష్టమైన హెచ్చరిక
వివాదంపై స్పందించిన చంద్రహాస్.. ఆ వీడియోలో ఏమన్నాడు?
సోషల్ మీడియాలో ముదురుతున్న చర్చ.. ఎటు దారి తీస్తుంది?

Feb6thRelease | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తమ సినిమాకి జనాలు రప్పించడం కోసం.. డిఫరెంట్ గా పబ్లిసిటీ చేస్తుంటారు. ఆఫర్స్.. బంపర్ ఆఫర్స్.. ఇస్తామని.. ఉచితంగా పట్టు చీరలు ఇస్తామని.. ప్రకటించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరీ మారింది. ఏదోటి కొత్తగా చేసి.. వైరల్ అయిపోయవాలి. ఆవిధంగా సినిమాకి పబ్లిసిటీ తీసుకురావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు బూతు మాటలు.. బూతు పాటలు.. మాట్లాడడం.. పాడడం.. పేషన్ అయిపోయింది. రాజకీయ నాయకుల్లో కొంత మంది ఇదే పని చేస్తున్నారు.. సినిమాల్లో కొంత మంది ఇదే చేస్తున్నారు. తాజాగా చంద్రహాస్ స్టేజ్ పై చేసిన పని వివాదస్పదం అయ్యింది. ఇంతకీ.. ఏం జరిగింది..?

బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. చంద్రహాస్ బూతు పదలతో ఓ పాట పాడాడు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వైరలైన సాంగ్ గురించి.. స్టేజ్ పై చంద్రహాస్ ఈ పాట పాడడం గురించి.. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అయ్యారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సినిమా పబ్లిసిటీ కోసం మరీ ఇంతలా దిగజారిపోవాలా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

Feb6thRelease
Feb6thRelease

అయితే.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ చక్రవర్తి తన రియాక్షన్ ను ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశారు. సినిమాల ప్రమోషన్స్ ఎప్పుడైనా ఆకట్టుకునేలా ఉండాలని, కానీ అసభ్యంగా ఉండకూడదని జేడీ చక్రవర్తి అన్నారు. ప్రమోషన్స్ కోసం క్రియేటివ్ గా ఆలోచించాలని, అలా చేయడం తప్పు కాదని తెలిపారు. ఆడియన్స్ కు ప్రమోషన్స్ చేరేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. అందుకోసం అసభ్యకరమైన మార్గాలు అనుసరించాల్సిన అవసరం అసలు లేదని స్పష్టం చేశారు. ప్రమోషన్స్ అంటే గ్లామర్ షో, బూతు పాటలు కాదని చెప్పిన జేడీ చక్రవర్తి.. ఇటీవల వెళ్లిన ఓ ఈవెంట్ లో సాంగ్ పాడటం చూసి తాను షాక్‌ అయ్యానని అన్నారు. అదే సమయంలో పాట వినగానే అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండాల్సిందని అన్నారు.

ప్రస్తుతం నెట్టింట జేడీ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడమే కాకుండా.. సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి ప్రమోషన్స్ కోసం సంస్కారం కోల్పోవద్దన్న సందేశాన్ని ఆయన తన కామెంట్స్ ద్వారా క్లారిటీగా చెప్పారు. అయితే.. చంద్రహాస్ ఈ వివాదం పై ఓ వీడియో రిలీజ్ చేశారు. తను ట్రోలింగ్ చేసినప్పుడు వాడిన పదాల్లోంచి రెండు పదాలు తీసుకుని పాట పాడితే నేనేదో తప్పుచేసినట్టుగా విమర్శిస్తున్నారు. నేను నా మాట పై నిలబడి ఉన్నాను. నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో మరింతగా విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి.. ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో..?

click here to read more

Leave a Reply