Road accident | విధులకు వెళ్తూ విషాదం..

Road accident | విధులకు వెళ్తూ విషాదం..

  • పరిగి క్రాస్ వద్ద ఘోర ప్రమాదం..
  • ఎంఎటీఎస్ టీచర్ దుర్మరణం
  • ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Road accident | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్ ) ఉపాధ్యాయులు ఇరువురు మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు ఆదినారాయణ (50) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తుమ్మలప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి ప్రాంతానికి చెందిన 2008 సంవత్సరంలో డీఎస్సీలో క్వాలిఫై అయిన ఆదినారాయణ ఎంటీఎస్ టీచర్ గా మడకశిర ప్రాంతంలోని మోపూరు గుండు ఎంపీపీ ఎస్ స్కూల్ లోపనిచేస్తాడు.

తుమ్మలప్ప 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయుడిగా దేవరహట్టిలో పనిచేస్తాడు. శివరాత్రి ఆదివారం, సోమవారం సెలవు అనంతరం మంగళవారం విధులకు హాజరయ్యేందుకు వారు కదిరి నుంచి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా హిందూపురం సమీపంలోని పరిగి క్రాసు వద్ద రోడ్డు దాటిన అనంతరం ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందగా తుమ్మలప్ప కాలు విరిగి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి పోలీసులు తెలిపారు.

Leave a Reply