రైతు కష్టం తీరేది ఎప్పుడు..?
కుబీర్ (ఆంధ్రప్రభ) : ఆరు కాలాలు కష్టపడి చేతికొచ్చిన పంట ఇంటికి తీసుకొని రావాలన్నా.. వచ్చిన పంట అమ్ముకునేందుకు రైతుకు నానా కష్టాలు తప్పడం లేదన్నారు. నిర్మల్ జిల్లా (Nirmal District) కుబీర్ మండలంలోని కుబీర్ లో ప్రాథమిక సహకార సంఘం వద్ద టోకెన్ల కోసం రైతులు (Farmers) శనివారం తెల్లవారుజాము నుండి బారులు తీరారు.
శనివారం నుండి రైతు తమ పంటను అమ్మేందుకు టోకెన్ల(tokens) ను పంపిణీ చేస్తున్నట్లుగా సంబంధిత వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చిన వెంటనే అలా అలా ఒక్కొక్క రైతు నుంచి ఈ వార్త మండలంలోని రైతులందరికీ చేరింది. శనివారం ఉదయం నుంచి మహిళలు, పురుషులు సైతం బారులు తీరారు. ఒక్కొక్క రైతు నాలుగైదు పట్టా పాస్ బుక్ లు పట్టుకుని నిలవడంతో.. ఒక్కొక్కరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారని రైతు ఆవేదన చెందారు. కుబీర్ కేంద్రంలోనే కాకుండా పరిసర గ్రామాలలో కూడా కొనుగోలు చేసే విధంగా చాత, మాలేగా, పాల్సి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.


