రైతాంగ ధర్నాకు తరలి రావాలి…

రైతాంగ ధర్నాకు తరలి రావాలి…
సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య.
మునుగోడు, ఆంధ్రప్రభ : ఉదయ సముద్రం కాలువలను పూర్తి చేసి చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న రైతాంగ ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామ సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతాంగ ధర్నాకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుండ్లోరిగూడెం గ్రామంలో రైతులతో కలిసి ఆమె ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఉదయ సముద్రం కాలువలను పూర్తి చేసి చెరువులను నింపితే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 16న తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న రైతాంగ ధర్నాను విజయవంతం చేయడానికి రైతన్నలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.
