నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి

నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రె స్ నాయకుల వాగ్వాదం
క్రమశిక్షణ చర్యలో భాగంగా ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు ప్రకటనలో వెల్లడి..
జిల్లాలో చర్చనీయాంశం..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో కాంగ్రెస్ నేతలు.. నువ్వెంత నువ్వెంత అంటూ కాంగ్రెస్ నాయ కుల మధ్య లొల్లి జి ల్లాలో చర్చ నీయా అంశమైంది. భారత్ యాస్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంతో భారత దేశ రైతులకు అన్యాయం జరుగుతుం దని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిసాన్ న్యాయ్ సత్యా గ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేప ట్టారు.

కార్యాలయంలో కార్యక్రమం కొనసాగు తుండగానే రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మన్, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వ హిస్తుండగా అక్కడికి చేరుకొని డిసిసి అధ్య క్షులు నగేష్ రెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా కార్యాలయంలో ఒక వైపు న్యాయ్ సత్యా గ్రహ దీక్ష కొనసాగు తుం డగా ఇక్కడ పుట్టిన రోజు వేడుకలు నిర్వ హించడం ఏమిటని వే ణు రాజుని ప్రశ్నించా రు.

డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కూడా అభ్యంతరం వ్య క్తం చేశారు. ఎంత చెప్పి న కానీ వారు వినలేదు. ఇక్కడ ఎందుకు బర్త్డే వేడుకలు చేయొద్దు అంటూ రాద్ధాంతం చేశారు. ఈ విషయమై నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాం గ్రెస్ నేతల మధ్య చోటు చేసుకున్న లొల్లి జిల్లాలో చర్చ నియాంశమైంది.

క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెన్షన్…

ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ డిసిసి అధ్యక్షులు ఒక ప్రకటనలో వెల్లడి….

క్రమశిక్షణ చర్యలో భాగంగా మాజీ రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజ న్ మాజీ ప్రెసిడెంట్ పుం డ్ర సాయి కుమార్, మా జీ ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు నరేన్ దీప్ ల ప్రాథమిక సభ్యత్వం రద్దు చేస్తూ సస్పెన్షన్ చేసినట్లు డిసిసి అధ్య క్షులు బొబ్బిలి రామ కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐసిసి ఆదేశాల మేర కు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా కిసాన్ న్యా య్ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన ట్లు తెలిపారు.

ఈ కార్య క్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,రాష్ట్ర విత్త నభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి రామకృష్ణ, పీసీ సీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ లు ముఖ్యఅతిథిగా హాజర య్యారు.

ఈసందర్భంగా డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ… న్యాయ్ సత్యా గ్రహ దీక్ష లో నేతలు ప్రసంగిస్తున్న సమయంలో వరదబ ట్టు వేణు రాజ్, పుండ్ర సాయికిరణ్, నరేన్ దీప్ ఇంకొంతమంది వారి వ్యక్తిగత కార్యచరణను దృష్టిలో పెట్టుకొని యు వజన కాంగ్రెస్ కార్యక్ర మాన్ని అంతరాయం కలిగించే విధంగా అక్క డ ఉన్న నాయకులతో వాగ్వివాదం పెట్టుకున్న సమయంలో హెచ్చరిం చిన వినకుండా తాను అనుకున్న కార్యక్రమా న్ని చేసి పార్టీ క్రమశిక్ష ణాలను ఉల్లంఘిం చ డం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర నాయకత్వం ఎదుట ప్రత్యక్షంగా ఈ ఘటన జరగడంతోఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు.ఇందుకు పార్టీ ప్రాథమిక సభ్య త్వాన్ని రద్దు చేస్తున్న ట్లు రామకృష్ణ తెలిపారు.

Leave a Reply