పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
- రైతుల ఆర్థిక అభివృద్ధికి పశు సంపద కీలకం
- పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి
- మండల పశు వైద్యాధికారి శృతి
రాయపర్తి, ఆంధ్రప్రభ : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని,పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని, సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి అన్నారు. గురువారం మండల కేంద్రంలో సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి అధ్యక్షతన, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గాలికుంటు నివారణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పశువైద్యాధికారి శృతి హాజరై, పశుపోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నికారణ టీకాలు వేయించాలని తెలిపారు.
ఈ సందర్భంగా గారే సహేంద్ర బిక్షపతి మాట్లాడుతూ.. గ్రామంలో గాలికుంటు నివారణ కార్యక్రమాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలనితెలిపారు.పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుందని అన్నారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి పశుసంపద, పశువుల ఆరోగ్యం అత్యంత కీలకమని తెలిపారు. పశువులకు టీకాలు వేయించడం ద్వారా వ్యాధులను ముందుగానే నివారించి పశుసంపదను కాపాడుకోవడానికి తెలిపారు.
అనంతరం. పశు వైద్యాధికారి శృతి మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధితో పాల ఉత్పత్తి తగ్గుతుంది, వైద్య ఖర్చులు పెరుగుతాయి, పశువులు కూడా బలహీనపడతాయి,సుడి పశువుల్లో గర్భ శ్రవం జరుగుతుంది, కోలుకున్న తర్వాత పశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతాయి. పశువుల ఉత్పాదక శక్తి తగ్గి క్రమంగా రైతులకు నష్టం జరిగి,రైతులపై ఆర్థిక భారం పడుతుందని అన్నారు.
రైతులు వెంటనే ఉచిత టీకాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఎండి మహమూద్,ఎల్ ఎస్ ఏ వెంకటయ్య, వీఏ గణేష్,కపిల్,గోపాలమిత్ర రమేష్, పశుపోషకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
