రైతు ఆత్మహత్యాయత్నం
కుత్బుల్లాపూర్, ఆంధ్ర ప్రభ : దుండిగల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ యువ రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ ఘటన ఈ రోజు చోటుచేసుకుంది. దుండిగల్ తండా 2కు చెందిన యువ రైతు సిద్దు సర్వే నెంబర్ 148, 150లోని భూదాన్ భూమిలో తనకు పట్టా, పాస్ బుక్‌లు జారీ చేయాలని కొన్ని రోజులుగా స్తానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారులను ఆర్జిస్తున్నాడు.
తనకు కోర్టు ఆర్డర్ కాపీ(Copy of court order) ఉందని గతంలోనే రెవెన్యూ అధికారులకు సదరు కోర్టు కాపీలను అందజేశారు. తనభూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఏంఆర్ఓ ఆఫీస్(NRO office)లో విన్నవించినప్పటికీ అధికారులు సర్వేకు రావడం లేదని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని, అంతేకాకుండా రూ.6లక్షలు డిమాండ్(demand Rs.6 lakhs) చేశారని రైతు సిద్దు ఆరోపించారు. ఇదిలా ఉంటే తన భూమిని ఓ బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ రోజు రైతు సిద్ధుకు, కార్యాలయంలోని సిబ్బందికి వాదోపవాదాలు జరగడంతో మనస్తాపం చెందిన యువ రైతు సిద్దు కార్యాలయం ముందు తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిమీద పోసుకుని చేతిలో లెటర్‌ను చూపిస్తూ రెవెన్యూ అధికారుల తీరుతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే సిబ్బంది, ఇతర స్థానికులు రైతు సిద్ధు(Rythu Sidhu)ని వారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండిగల్ పోలీసులు(Dundigal police) సంఘటనా స్థలానికి చేరుకుని రైతును వారించారు. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

