Farmer | భూ రక్షణ కోసమే రీ సర్వే

Farmer | భూ రక్షణ కోసమే రీ సర్వే
- మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
- రైతులకు నూతన పాసు పుస్తకాల పంపిణీ
Farmer | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రైతుల భూముల రక్షణ కోసమే ప్రభుత్వం రీ సర్వే నిర్వహించి వారికి ఉన్న భూ హక్కులతో ప్రభుత్వ రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త చెరువు మండలం లింగారెడ్డిపల్లిలో ఈ రోజు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై మాట్లాడారు. రైతులు ఆస్తి విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రీ సర్వే చేయించి ఎవరి భూమి వారికే హక్కు కల్పిస్తున్నారని తెలిపారు.
మన భూమి మన హక్కు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేస్తోందని తెలిపారు. ఎక్కడ చూసినా ఆస్తి సమస్యలే ఎక్కువుగా తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. ఆస్తి తగాదాలు లేకుండా రెవెన్యూ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి విచ్చేసిన రైతులకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామాంజనేయులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
