కుటుంబ క‌ల‌హాలే కార‌ణం

కుటుంబ క‌ల‌హాలే కార‌ణం

తిర్యాణి, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలతో సైదం కల్పన (28) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిర్యాణి మండ‌లం గంభీరావుపేట‌(Gambhiraopet)లో చోటుచేసుకుంది. గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం శేఖర్‌(Saidam Shekhar)తో తన మేనమామ బెల్లంపల్లి మండలం కన్నల గ్రామానికి చెందిన జాగిర్తి బాపు కుమార్తె క‌ల్ప‌న‌తో ప‌న్నేండేళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది. గ‌త కొంత కాలంగా భార్యాభ‌ర్త‌ల(husband and wife) మ‌ధ్య వివాదాలు జ‌రుగుతున్నాయి.

ఈ క్రమంలో సోమ‌వారం రాత్రి కల్పన పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గమనించి తిర్యాణి(Thiryani) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కల్పన మృతి చెందినట్లు ఎస్సై వెంకటేష్(S.i Venkatesh) తెలిపారు. కల్పన తల్లి జాగిర్తి దేవక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అల్లుడే తమ కుమార్తెను హతమార్చాడాన్ని కల్పనా తల్లిదండ్రులు ఆరోపించారు. కల్పన శేఖర్ దంపతులకు కుమారుడు హర్షవర్ధన్(8), కుమార్తె సామాన్విత(Samanvita) (6)లు ఉన్నారు.

Leave a Reply