భారీ పేలుడు.. ఆరుగురి మృతి
ఆంధ్రప్రభ, అమలాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా Konaseema District) లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాయవరంలో గల బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.