విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు….

విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు….
కార్పొరేటర్ నేలీ బండ్ల బాల స్వామి…
విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ కార్పోరేషన్ పరిధి లోని 23 వ డివిజన్ బిషప్ హాజరయ్యా బాలికల ఉన్నత పాఠశాల నందు 10 వ తరగతి విద్యార్థులకుశిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాను సారం స్థానిక కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ప్రతి రోజు సాయంత్రం 160 మంది విద్యార్థులకు టిఫిన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దానిలో భాగంగా పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా రెండు రోజులే ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరికీ కూడా రోజు బిర్యానీ చికెన్ కర్రీ తో మంచి భోజనాన్ని ఏర్పాటు చేయించి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థులకు వడ్డించే కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విద్యార్థులకు సోమవారం నుంచి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ లో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు జయశ్రీ 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
