TET Exams | నేటి నుంచి “టెట్” పరీక్షలు
- పల్నాడు జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాల ఏర్పాటు
TET Exams | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలు సజావుగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి(Revenue Officer Murali) ఆదేశించారు. కలెక్టరేట్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, సంబంధిత అధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ… పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సి ఉందన్నారు. పరీక్షల(examinations) నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలులో ఉండేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్య శిబిరాల(Medical health camps)ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకునే విధంగా కావాల్సినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించుటకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్క్వాడ్లు(Squads)గా నియమించబడిన శాఖాపరమైన అధికారులు పరీక్షా కేంద్రాలను తరచూ తనిఖీ చేసి పరీక్షలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. పరీక్షా సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా అంతర్జాలం, విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఇవే…!!
- నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజ్, కొటప్పకొండ రోడ్, ఎల్లమంద, నరసరావుపేట.
- ఏ. ఎం. రెడ్డి మెమోరియల్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ కాలేజ్ వినుకొండ రోడ్, పెట్లూరివారిపాలెం, నరసరావుపేట మండలం.
- మామ్ మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ , కేసానుపల్లి, నరసరావుపేట మండలం.
- నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజ్ ఆటోనమస్ బ్లాక్-4, కొటప్పకొండ రోడ్, ఎల్లమంద- నరసరావుపేట మండలం.
- తిరుమల ఇంజినీరింగ్ కాలేజ్, జొన్నలగడ్డ గ్రామం, నరసరావుపేట మండలం.

