Ex Mla Visited | పలువురికి పరామర్శలు
Ex Mla Visited | భువనగిరి (రూరల్), ఆంధ్రప్రభ : భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామంలో పలు కుటుంబాలను భువనగిరి మాజీ ఎమ్మెల్యే (Ex Mla) పైళ్ల శేఖర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి రవికి కాలుకు దెబ్బ తగలడంతో పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొమురెల్లి వెంకట్ రెడ్డికి ఇటీవల కాలంలో సర్జరీ కావడంతో పరామర్శించారు.
ఈ పరామర్శలో జిల్లా రైతు సమన్వ సమితి మాజీ జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ జెడ్పిటిసి (Zptc) సుబ్బురు బీరు మల్లయ్య, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్ గౌడ్, మండల యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరు మధు, గోపాల్, నాగారం సూరజ్, పెంట నితీష్, తదితరులు పాల్గొన్నారు.


