వికారాబాద్, జులై 9 (ఆంధ్రప్రభ): వన మహోత్సవంలో భాగంగా ప్రతి పౌరుడు మొక్క నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Collector Prateek Jain) పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా (Vikarabad District) నవపేట మండలం చింతలపేట గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల యందు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి మొక్కలు నాటారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించడం కోసం మొక్కలు తప్పనిసరి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య (Chevella MLA Kale Yadayya) మాట్లాడుతూ.. ప్రతిపాడు బాధ్యతహితంగా మొక్కలు నాటినప్పుడే అవి భవిష్యత్తు తరులకు మంచి ఆక్సిజన్ ను అందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవపేట్ తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీవో అనురాధ, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు, పీఏసీఎస్ చైర్మన్ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.