ప్ర‌తి పేద‌వాడికి సొంతిల్లు

వేములవాడ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. ఈ రోజు పోచెట్టిపల్లి, గుర్రవానిపల్లె గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసిన శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ‌ను తీర్చిదిద్దుతున్నామ‌న్నారు.

వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయని శ్రీ‌నివాస్ అన్నారు. ఇళ్లు లేని వారికి గూడు కల్పించడం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేద‌ని తెలిపారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇల్లు కట్టిస్తానని మోసం చేసిందని శ్రీ‌నివాస్‌ గుర్తు చేశారు. పట్టణంలో గ్రామాల్లో పండగ వాతావరణం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాటలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో పూరి గుడిసెల్లో రేకుల షెడ్లల్లో నివసించే వార‌ని, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు మంజూరైందని పేద‌లు సంతోషాలను వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోడి రాజు, రంగు వెంకటేష్ గౌడ్, వకుళాభరణం శ్రీనివాస్, రోమాల ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply