PENSION | 11 నెలలు తిరిగినా..

PENSION | 11 నెలలు తిరిగినా..


PENSION | బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : పుట్టుకతో మానసిక శారీరకంగా వైకల్యం కలిగి మంచానికి పరిమితమైన తన కుమారుడు కావూరి ఇస్సాకు (23)కు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రూ.15,000 ఇప్పించాలని ఇస్సాకు తల్లి జ్యోతి కలెక్టర్ (Collector) కు అర్జీ అందించారు. జిల్లాలోని రేపల్లె మండలం బేతపూడి పంచాయతీ జాషువా నగర్ కు చెందిన కావూరి జ్యోతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న పీజిఆర్ఎస్ కార్యక్రమానికి పూర్తి అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన తన కుమారుడిని ఆటోలో తీసుకువచ్చింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మా కుమారుడు కావూరి ఇస్సాకు పుట్టుకతో మానసిక శారీరక అంగవైకల్యంతో జన్మించాడని.. అప్పటి నుండి అనేక ఆసుపత్రులకు తిరిగి లక్షలు వెచ్చించి వైద్యం చేయించినా వైకల్యం తొలగలేదు అన్నారు. 2018 సంవత్సరంలో 100 శాతం వైకల్యం నమోదు చేసి సదరం సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందని.. అప్పటి ప్రభుత్వంలో రూ.6000 రూపాయలు పెన్షన్ లబ్ధి పొందామని తెలిపింది. కూటమి ప్రభుత్వంలో (In the coalition government) మంచానికే పరిమితమైన ఇస్సాకు గుంటూరు సర్వజన ఆసుపత్రిలో వైకల్యాన్ని తగ్గించి 88% నమోదు చేసి ధ్రువపత్రం అందించారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కొరకు బాపట్ల జిల్లా సమగ్ర వైద్యశాలలో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు పెన్షన్ (Pension) మంజూరు కాలేదు. సాధారణ పెన్షన్ రూ.6000 మాత్రమే ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాల, సచివాలయం కార్యాలయాల చుట్టూ 11 నెలలుగా తిరుగుతున్నా అధికారులు సమస్యకు పరిష్కారం చూపించలేదు అన్నారు. జిల్లా కలెక్టర్ కు అర్జీ దాఖలు చేసేందుకు ఇంత దూరం రావాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

Leave a Reply