Erraya | గెలిపిస్తే… అభివృద్ధి చేసి చూపిస్తా

Erraya | గెలిపిస్తే… అభివృద్ధి చేసి చూపిస్తా
- ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి
- మీ గ్రామాల సహకారమే నాకు ఆయువు పట్టు
- :స్వతంత్ర సర్పంచి అభ్యర్థి ఊకే ఎర్రయ్య
Erraya | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : రాయపాడు పంచాయతి ప్రజలు ఓటువేసి ఆదరించి గెలిపిస్తే సంపూర్ణ అభివృద్ధి గ్రామంగా అన్నిరంగాల్లోని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఊకే ఎర్రయ్య అన్నారు. రాయపాడు, ముత్తాపురం, గుత్తి కోయగుంపు, ఆర్చిగుంపులోని కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, చేతుల్లో చూపిస్తానని, ఆశతో రాలేదని, మంచి దృఢసంకల్పంతో, అభివృద్ధి చేయాలనే ఆశతో వచ్చానని, మీ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.
రాయపాడు గ్రామంలో మద్దతుదారులు పెండకట్ల పాపారావుతో పాటుగా యువకులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశానన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఎలాంటి పనులకు నోచుకోలేదని సర్పంచ్ గా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని, సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
గ్రామంలోని ప్రతి సమస్యను తెలిసిన, అవగాహన ఉన్న వ్యక్తిగా నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసేభాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని, ఆదరించి ఓటువేసి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తూ, డ్రైనేజీలు నిర్మిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
