జన గణన ఎన్యుమరేటర్లుగా గిరిజన ఉపాధ్యాయులను నియమించాలి

జన గణన ఎన్యుమరేటర్లుగా గిరిజన ఉపాధ్యాయులను నియమించాలి
జిల్లా కలెక్టర్‌కు ఎస్టియు సంఘ నాయకుల వినతి
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వపరంగా చేపట్టే జన గణన 2026 కార్యక్రమంలో ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలో పనిచేస్తున్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా,సూపర్ వైజర్లుగా నియమించాలని కోరుతూ శనివారం అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష కు కలిసి విన్నవించినట్లు అదిలాబాద్ ఎస్టియు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూగ శ్రీనివాస్, జాదవ్ రవికుమార్ లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించకపోవడం సూచనియమని వారికి కూడ ఎయిర్టెల్ గా నియమించాలని కలెక్టర్ కు విన్నవించినట్లు వారు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జన గణన విధుల నిర్వహణ కోసం సూపర్ వైజర్లుగా, ఎన్యుమరేటర్లుగా చాలా మండలాలలో గిరిజన సంక్షేమశాఖఉపాధ్యాయులను ఎంపిక చేయలేదని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలోగాని, జిల్లా విద్యాశాఖ నిర్వహించే విద్యాసంబద కార్యక్రమాల నిర్వహణ లో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని అన్నారు.
కాని ప్రస్తుతం జన గణన విధుల నిర్వహణ బాధ్యతలకు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులను ఎంపిక చేయకపోవడం విడ్డూరంగా ఉందని వెంటనే అన్ని మండలాల్లో జన గణన విధుల నిర్వహణ కు ఎన్యుమరేటర్లుగా, సూపర్ వైజర్లుగా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులను కూడా నియమించాలని కలెక్టర్ కు కోరినట్లు తెలిపారు.
