మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ విడుదల చేశారు. ఎం.ఎం కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ పాటకు సరస్వతిపుత్ర రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. శంకర్ మహాదేవన్, లిప్సికా ఆలపించారు. పాట వినసొంపుగా ఉండి, శ్రోతులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీరాముడి గొప్పతనం ఈ పాటలో వివరించారు. అలాగే చిరు కూడా తనదైన గ్రేస్‌తో పాటపై డ్యాన్స్ చేయడం చూస్తుంటే ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష, ఆషికా రంగానాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ‘విశ్వంభర’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘రామ రామ’ పాట కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెంచేసింది.