England Open | మిక్స్‌డ్ డబుల్స్ లో భార‌త్ కు షాక్ !

బర్మింగామ్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్న‌మెంట్ లో భారత్‌కు మరో షాక్ తగిలింది. ఈరోజు (మంగ‌ళవారం) మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ ఎస్.కె. కరుణాకరన్ – ఆద్య వారియత్ తమ తొలి రౌండ్ మ్యాచ్‌లో చైనా మిక్స్‌డ్ డబుల్స్ జోడీ చెన్ ఫెంఘుయ్ – గువో జిన్హువాతో తలపడ్డారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఘోరంగా ఓడిపోయింది.

చైనా మిక్స్‌డ్ జోడీ చెన్ ఫెంఘుయ్ – గువో జిన్హువా చేతిలో 21-6, 21-15 పాయింట్ల తేడాతో వరుస గేమ్‌లను ఓడిన భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ ఎస్.కె. కరుణాకరన్ – ఆద్య వారియత్.. ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

రేప‌టి షెడ్యూల్ :

మిక్స్‌డ్ డబుల్స్ లో భార‌త్ రేపు రెండు మ్యాచ్ లు ఆడ‌నుంది. ఇందులో రోహన్ కపూర్ – రుత్విక గద్దె జోడీ తైవాన్ కు చెందిన యే హాంగ్ వేయ్ – ఎన్. జి. చాన్ జోడీతో త‌ల‌ప‌డ‌నుంది.

మరో మ్యాచ్‌లో థాయిలాండ్‌కు చెందిన రుత్తనపక్ అప్తాంగ్-జెనిచా సుద్జైప్రప్రాత్‌తో భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో తలపడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *