England Batter | సూపర్ ఫామ్‌లో రూట్
- సెంచరీలతో చెలరేగుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్
- సిడ్నీ టెస్టులో 41వ శతకం బాదేశాడు
- రికీ పాంటింగ్ రికార్డు సమం
- టెస్టుల్లో సచిన్ రికార్డుకు 2వేల లోపు పరుగుల దూరంలో రూట్
- 2021 నుంచి అదరగొట్టేస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్
England Batter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టెస్టుల్లో (Test) దిగ్గజాల సరసన నిలచే ఆట అతనిది. ఇప్పటికే సచిన్, పాంటింగ్, కలిస్ రికార్డులను చెరిపేసేందుకు దగ్గరలోనే ఉన్నాడు. మరో రెండేళ్లలో వారి రికార్డులను అధిగమించేందుకు సిద్ధమవుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ.. పరుగుల వరద పారిస్తున్నాడు.
యూషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ (England) జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతునున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో రూట్ 2వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసేసరికి అతడు 72రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. రెండోవ రోజు ఆట ప్రారంభం కావడంతో అతడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జోరూట్ 242 బాల్స్‌లో 160 రన్స్ కొట్టి ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 384కి ఆలౌట్ అయింది.

England Batter | సచిన్ రికార్డుకు చేరువగా..
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఇంగ్లాండ్ బ్యాటర్ జోరూట్ చేరువగా వచ్చాడు. టెస్టు క్రికెట్ (Cricket) చరిత్రలో తిరుగులేని రికార్డులతో ఉన్న సచిన్‌ను అధిగమించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో యాషెస్ టెస్టులో తన 41వ శతకాన్ని పూర్తి చేసిన రూట్ శతకాల సంఖ్యలో దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్‌ను సమం చేయడమే కాకుండా.. పరుగుల వేటలోనూ సచిన్ రికార్డుకు అత్యంత చేరువయ్యాడు.
England Batter | మరో రెండు వేల పరుగుల లోపు..
టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు (15,921 పరుగులు) ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)పేరిట ఉంది. సోమవారం నాటి ఇన్నింగ్స్‌తో జో రూట్ 14,000 పరుగుల మైలురాయికి చేరువవడమే కాకుండా, సచిన్ రికార్డును అధిగమించేందుకు అవసరమైన దూరాన్ని 2,000 పరుగుల లోపునకు తగ్గించాడు. ఇదే ఫామ్‌ను మరో రెండేళ్లు కొనసాగిస్తే, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
England Batter | శతకాల్లోనూ..
కేవలం పరుగులే కాకుండా, శతకాలు, అర్ధ సెంచరీల (Century) విషయంలోనూ రూట్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 41 సెంచరీలతో ఉన్న రూట్.. సచిన్ (51 సెంచరీలు) కంటే 10 సెంచరీల దూరంలో ఉన్నాడు. అలాగే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన సచిన్ (68) రికార్డును అధిగమించేందుకు రూట్‌కు మరో మూడు అర్ధ సెంచరీలు మాత్రమే అవసరం. 2021 నుంచి అసాధారణ ఫామ్‌లో ఉన్న రూట్ కేవలం నాలుగు ఏళ్లలోనే 24 సెంచరీలు సాధించడం అతడి పరుగుల దాహానికి నిదర్శనం.
England Batter | సచిన్, కలిస్ తర్వాత..
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో ప్రస్తుతం సచిన్ (51), జాక్వెస్ కలిస్ (45) మాత్రమే రూట్ కంటే ముందున్నారు. పాంటింగ్‌ను సమం చేసిన రూట్, త్వరలోనే కలిస్ రికార్డును కూడా దాటే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా (Australia) గడ్డపై యాషెస్ సిరీస్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతికొద్ది మంది ఇంగ్లాండ్ బ్యాటర్ల ఎలైట్ జాబితాలోనూ రూట్ చేరిపోయాడు.

