మహిళలు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలి…

మహిళలు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలి…
రాప్తాడు, ఆంధ్రప్రభ : మహిళలు విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయాల్లో అభివృద్ధి చెందాలని మహిళా సాధికారత సెల్ కో-ఆర్డినేటర్ ఎస్. ఆయేషా పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని హాంపాపురం దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా సాధికారత సెల్ కో-ఆర్డినేటర్ ఎస్. ఆయేషా హాజరయ్యారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళా సాధికారత, మహిళలపై వేధింపుల నివారణ గురించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్.శర్మ చైర్మన్ బి.వి.కృష్ణా రెడ్డి వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ టి.విష్ణు వర్ధన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.విజయ భాస్కర్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
