కోరుట్లటౌన్, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో ఉన్న రక్షకభటుడిని అత్యంత రాక్షసంగా పొడిచి చంపిన హంతకుడు రియాజ్ ను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు సురభి నవీన్ కుమార్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ కరువైన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొనడం తీవ్ర విచారకరమన్నారు.
నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై ఇంతటి దారుణం చోటు చేసుకుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అసలు ఆ నిందితుడికి మారణాయుధాలు ఎలా లభ్యమయ్యాయి..? ఇంతకుముందు ఇంకా ఎంతమందిని ఈ విధంగా చంపాడు..? వెలుగులోకి రాని కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో..? అన్ని కూడా వెలికి తీసి ఇంతటి క్రూరమైన మనస్తత్వం కలిగిన హంతకులను రాష్ట్ర పోలీసు యంత్రాంగం స్పందించి వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని అన్నారు.