Employees | ప్రతి ఉపాధి హామీ కూలికి పని కల్పించాలి

Employees | ప్రతి ఉపాధి హామీ కూలికి పని కల్పించాలి

Employees | సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : ప్రతి ఉపాధి హామీ కూలికి పని కల్పించాలని బుర్నూర్ బి సర్పంచ్ పెందూర్ గణపత్ రావు అన్నారు. ఆయన కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని బుర్నూర్ బి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా ఫారం పండ్ పనులను పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పని కల్పించడంతోపాటు వారి కూలి డబ్బులు త్వరగా చెల్లించేలా చూడాలని కొలతల ప్రకారంగా పనులు చేపట్టాలని సర్పంచ్ కోరారు. ప్రజలకు రైతులకు ఉపయోగపడే పనులను చేపట్టాలని సర్పంచ్ ఈజీఎస్ ఉద్యోగులకు కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ కైలాస్, మేట్ సుదర్శన్ కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply