ఆదరించండి.. అభివృద్ధిని స్వాగతించండి

  • బుసరెడ్డిపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మంతురి స్వప్న

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బుసరెడ్డిపల్లి గ్రామాభివృద్ధి కోసం ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి, అభివృద్ధిని స్వాగతించాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంతురి స్వప్న శశికుమార్ కోరారు.

తన ప్యానల్‌లోని వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేయడం అంటే అభివృద్ధికి మద్దతు తెలిపినట్లేనని ఆమె ఓటర్లకు వివరించారు.

మునిపల్లి మండలంలోనే బుసరెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు. గతంలో గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఓటర్లకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.

బుసరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కోసం మరో అవకాశం ఇవ్వాలని శశికుమార్ తన సతీమణి స్వప్నతో కలిసి గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply