Eluru | విద్యార్థుల.. అర్ధరాత్రి గొడవ..

Eluru | విద్యార్థుల.. అర్ధరాత్రి గొడవ..
Eluru, ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు గవర్నమెంట్ వైద్య కళాశాలలో సీనియర్లు, జూనియర్లు రెండు వర్గాలుగా చేరి అర్ధరాత్రి హాస్టల్ ఆవరణంలో ఒకరిపై ఒకరు దాడికి ప్రయత్నించారు. కొంతకాలంగా మూడో సంవత్సరం విద్యార్థులు.. రెండవ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలానికి ఏలూరు రెండో పట్టణ పోలీసులు చేరుకొని ఇరువర్గ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వగా 15 మంది సీనియర్లు వేధిస్తున్నారని పోలీసులకు జూనియర్ లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం పై సమగ్ర విచారణ పోలీసులు ఇంకా చేయాల్సి ఉంది.
