చంద్రగిరి మండలంలో ఏనుగుల ఘీంకారం
తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా చంద్రగిరి(Chandragiri) మండలంలోని మూలపల్లి గజరాజులు ఘీకరి స్తున్నాయి. శేషాచలం నుంచి బయటకు వచ్చి రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు బికిబిథక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రెండు రోజుల క్రితం చిన్న రామాపురం లోనికి ఏనుగుల గుంపు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అది మరొక ముందే ఈ రోజు ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఏనుగుల(elephants) మంద రోడ్డుపై హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.
పశువుల వద్దకు వెళ్లిన కాపరులు పొలాల్లోని పాడి రైతులు ఇల్లకు చేరుకుని తలుపులు మూసుకున్నారు. ఏనుగుల గుంపు రోడ్లపై పెద్ద ఎత్తున ఘీంకారం చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. పొలాల్లోకి వెళ్లి పంటలను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. మదపుటేనుగులు గ్రామాల్లో స్వైర విహారం(Swaira Viharam) చేస్తున్నాయి.
అయితే అధికారులు చోద్యం చూస్తూ ఉండటం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ఏనుగులు సంచరించిన ప్రాంతాలను పరిశీలించి ఆటవీశాఖ అధికారులకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే ఏనుగుల సంచారం పై తమకు ఏమి పట్టనట్లు చోద్యం చూస్తున్నారని ఏనుగుల సంచారం పై గ్రామస్తులు సమాచారం అందిస్తే తప్ప అటువైపు రావడంలేదని అటవీ శాఖ అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత దశాబ్దంగా ఎప్పుడు ఏనుగులు ఇంత పెద్ద స్థాయిలో పొలాలపై దాడి చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. వరి మామిడి పంటల(Mango crops)ను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏనుగుల సంచారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

