Electricity | రైతుల ఆగ్రహం..

Electricity | రైతుల ఆగ్రహం..

Electricity | ఆత్మకూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో విద్యుత్ సరఫరాలో సమస్యలు తీవ్రరూపం దాల్చటంతో మంగళవారం ఉదయం వందలాది మంది రైతులు (farmer) జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రైతులకు విద్యుత్‌ను సమయానికి ఇవ్వకపోవడంతో పాటు తరచూ నిలిపివేయడం, ఈ సమయానికి ఇస్తారో తెలియక మోటార్లు కూడా కాలిపోతున్నాయని రైతులు, గ్రామస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగారు. మంగళవారం గ్రామస్తులు రైతులతో కలిసి నేషనల్ హైవే రోడ్డు పై బైఠాయించి వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపారు. నేషనల్ హైవేపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంటసేపు జాతీయ రహదారి పై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Electricity

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్ (Electricity) సమస్యల గురించి తెలుసుకునేందుకు ఎప్పుడైనా కార్యాలయానికి వెళితే సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడం తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు విద్యుత్ కీలకమైందని ఇలా అనిశ్చితంగా విద్యుత్ నిలిపివేయడం వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆకస్మిక నిరసనతో హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామంలో సిబ్బంది అందుబాటులో ఉండాలని రైతులు డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఆత్మకూరు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాము సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఇటు అధికారులతోనూ మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.

Leave a Reply