విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా…

విద్యుత్ సమస్య లేకుండా కృషి చేస్తా…
చిట్యాల,, ఆంధ్రప్రభ : పెద్ద కపర్తి గ్రామంలో విద్యుత్తు సమస్యలు లేకుండా చేయడమే తన ప్రధమ లక్ష్యమని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం తెలిపారు. బుధవారం నాడు చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో శిథిల వ్యవస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలను సర్పంచ్ కాటం వెంకటేశం దగ్గరుండి విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ వేసవికాలంలో వచ్చే గాలి దుమారాలు, అకాల వర్షాలకు విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం కురు యాదయ్య, మర్రి హరీష్ రెడ్డి, ఆనగంటి నరేష్ తదితరులు ఉన్నారు.
