వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత

వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యత

  • ఎస్ఈ పి. వి. రాజేశ్వర్ రావు

నిజామాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందిం చడమే లక్ష్యంగా వ్యవసా య విద్యుత్ సర్వీసులు గరిష్ట స్థాయిలో మంజూరు చేసినట్లు నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ ఈ) పి. వి. రాజేశ్వర్ రావు మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు.నిజామాబాద్ పరిధిలో డిసెంబర్ నెల నుండి ఇప్పటివరకు మొ త్తం 978Nos. వ్యవసా య విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

పంటల కోత కాలం ముగియడంతో, రైతుల అవస రాలను దృష్టిలో ఉంచు కొని యుద్ధ ప్రాతిపదికన అత్యధిక సంఖ్యలో సర్వీసులు మంజూరు చేసి నట్లు పేర్కొన్నారు.కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో వేగం కొన సాగుతుందని ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర అవసరమైన మెటీరియల్ సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అధికారుల సమన్వయం సత్వర చర్యల ఫలితంగా సర్వీసుల మంజూరు ప్రక్రి య వేగవంతమైందని ఎస్ఈ తెలిపారు.

Leave a Reply