జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలి..

  • ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

జనగామ, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతి సర్పంచ్, వార్డు సభ్యుల సాధారణ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మైక్రో అబ్జర్వర్ల కు సూచించారు.

శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మైక్రో అబ్సర్వర్ లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని జనరల్ అబ్జర్వర్ రవి కిరణ్, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హాజరై మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పలు సూచనలను తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని, నైతికంగా వ్యవహారిస్తూ ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని సూచించారు.

మైక్రో అబ్జర్వర్లు తమ చెక్‌లిస్ట్‌లో ప్రతి అంశంపై “అవును/కాదు” గా నమోదు చేసి, గమనించిన లోపాలు లేదా సంఘటనలను ప్రత్యేక రిపోర్ట్‌లో పొందుపరచాలన్నారు. పోలింగ్ స్టేషన్‌లో బ్యాలట్ బాక్స్‌ను సరైన విధంగా ఫిక్స్ చేయాలనీ ఎంట్రీ పాస్ సిస్టమ్‌ను కచ్చితంగా అమలు చేయలన్నారు.

ఓటరు గుర్తింపు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేయాలన్నారు. ఇండెలిబుల్ ఇంక్ సరైన విధంగా అప్లై చేయడం, బ్యాలెట్ పేపర్ కౌంటర్ ఫాయిల్‌లో ఓటర్ వివరాలు నమోదు పోలింగ్‌లో రహస్యత్వం పూర్తి స్థాయిలో నిర్ధారించాలన్నారు.

పోలింగ్ ఏజెంట్ల ప్రవర్తన, వారి ఫిర్యాదులపై తక్షణ చర్య, గ్రామపంచాయతీ కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలించడం, కౌంటింగ్‌కు సంబంధించిన ప్రతి దశను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం, ఫలితాల ప్రకటన, ఎన్నిక సర్టిఫికేట్ జారీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ మాధురి షా, ఇంచార్జ్ డి పి ఓ వసంత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply