Elections | న‌మ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి…

Elections | న‌మ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి…

  • భాజపా పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ భూక్య సంగీత

Elections | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి నూతనంగా గెలిచిన సర్పంచులు కృషి చేయాలని భాజపా పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ భూక్య సంగీత అన్నారు. ఈ రోజు రెండవ విడత ఎన్నికల్లో(election) గెలుపొందిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు.

మండలంలో నూతనంగా ఏర్పడ్డ గ్యామాతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భాజపా పార్టీ బలపరచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య వినోద గెలుపొందడంతో శాలువాతో సన్మానించారు. అనంతరం గెలుపుకు సహకరించిన డోర్నకల్ నియోజకవర్గ భాజపా ఇన్చార్జి భూక్య సంగీతను కూడా శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా భూక్య సంగీత మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని ప్రజా సమస్యలు(problems) తీరుస్తూ గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్ లు కృషి చేయాలని కోరారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ గ్యామతండాను అభివృద్ధి(development) పథంలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరు నాయక్, ఉప సర్పంచ్ బానోతు జయ, వార్డు సభ్యులు భూక్య సునీత, భూక్య రవి, భూక్యా సీలి తదితరులు ఉన్నారు.

Leave a Reply