Elections | 10 రాష్ట్రాల్లో పెరిగిన రాజకీయ హీట్

Elections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజ్య‌స‌భ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఖాళీ కాబోతున్న రాజ్య‌స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం ప‌ది రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్య‌స‌భ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ది.

తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్ట‌ర్ అభిషేక్ మ‌ను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్ద‌రి ప‌ద‌వీకాలం ముగియ‌నున్న‌ది. ఇక మ‌హారాష్ట్ర నుంచి అత్య‌ధికంగా ఏడు మంది రాజ్య‌స‌భ ఎంపీలు త‌మ ప‌ద‌వీకాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన ఆ ఏడు స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఒడిశాలో న‌లుగురు , త‌మిళ‌నాడులో ఆరుగురు, బెంగాల్‌లో అయిదుగురు, అస్సాంలో ముగ్గురు , బీహార్‌లో అయిదుగురు, చ‌త్తీస్‌ఘ‌డ్‌, హ‌ర్యానాల్లో ఇద్ద‌రేసి, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఒక‌రి సీటు కోసం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఎన్నిక‌ల షెడ్యూల్‌కు చెందిన నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. మార్చి 5 వ‌ర‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. మార్చి 9వ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 16వ తేదీన ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు ఓటింగ్ జ‌రుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఉంటుంది.

Leave a Reply