Election Commission | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
Election Commission | ధర్మారం, ఆంధ్రప్రభ : ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బంగుటపు కొమురయ్య ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల సంఘం(Election Commission) కత్తెర గుర్తు కేటాయించడంతో బుధవారం గ్రామంలో ఆయన ప్రచారయాత్రలో తనను గెలిపించాలని ప్రజలను కోరుతూ ముందుకు సాగారు.
అడుగడుగునా ప్రజలంతా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో ఆయన సతీమణి సర్పంచ్ గ్రామాన్ని అభివృద్ధి చేసిందని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. మరోసారి బంగుటపు కొమురయ్యకు అవకాశం కల్పిస్తే, సామాజిక మార్పు ఖాయమని ప్రజలు విశ్వసిస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేస్తే గ్రామస్తుల కష్టాలన్నీ తీరుస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన వివరించారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో నర్సింగాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో పక్కా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కత్తెర గుర్తుకు ఓటేసి మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
మంత్రి సహకారంతో గెలిచిన తర్వాత పలు కుల సంఘాలకు(caste organizations) భవనాలు, అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ భూమి పంపిణీ, గిరికల వద్ద అంబేద్కర్, శివాజీ విగ్రహాలు, బస్టాండ్ దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మహిళా సంఘ భవనం, మాడెలయ్య గుడికి ప్రహారి నిర్మిస్తానన్నారు.
బస్టాండ్ నుండి గ్రామంలో వివిధ వాడలు, శ్రీకృష్ణ, సమ్మక్క గుడుల వరకు రోడ్ల నిర్మాణం పునరుద్ధరిస్తారని హామీ ఇస్తున్నారు. అందుబాటులో ఉండే వారికి అవకాశమిస్తే మరింత సేవ చేస్తానని కోరుతున్నారు.

