Eggs | అంగన్వాడి కోడిగుడ్లలో పురుగులు…
Eggs | మోతె, ఆంధ్రప్రభ : మోతె మండల పరిధిలోని విభలాపురం, నాగయ్య గూడెం ఆవాస గ్రామ అంగన్వాడీ ద్వారా పంపిణీ చేసిన ఉడకబెట్టిన కోడిగుడ్లలో పురుగులు బయటపడ్డాయి. అంగన్వాడీ సెంటర్(Anganwadi Center) నుండి కోడిగుడ్లను ఇంటికి తెచ్చి చూడగా లార్వా తరహా పురుగులు కనిపించడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు.
గర్భిణులకు, పిల్లలకు పంపిణీ చేసే అంటూ సంబంధిత పౌష్టికాహారం(Nutrition) ఇదేనా అధికారుల తీరుపై స్థానికులు గ్రామ యువత మండిపడ్డారు.నిల్వ ఉంచిన గుడ్లను సరఫరా చేయడంతోనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. గుడ్లు నిల్వ ఉంచకుండా పీకాక్ గ్రీన్, పింక్ కలర్ స్టాంపింగ్ విధానం ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం అనుమానాలకు తావునిస్తుంది.

