Eggs | అమెరికాలో కొండెక్కిన గుడ్డు – రేటు చూస్తే గుండె గుబేల్..

ఇండియాలో ఆరు రూపాయిలు
అదే అమెరికాలో 44 రూపాయిలు
జనవరిలో అక్క‌డ 28 రూపాయిలు
తాజాగా డ‌జ‌న్ ఎగ్స్ ధ‌ర 6.23 డాల‌ర్లు
బ‌ర్డ్ ఫ్లూ దెబ్బ‌తో కోళ్లు ఖ‌తం
దీంతో చుక్క‌ల‌ను తాకుతున్న గుడ్డు ధ‌ర

కాలిఫోర్నియా -తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధర ఎంత..5 లేదా 6 రూపాయల మధ్యే ఉంటుంది. కానీ అమెరికాలో మాత్రం ఒక్క గుడ్డు ధర ఏకంగా 44 రూపాయలకు చేరింది.. జ‌న‌వ‌రిలో రూ28 రూపాయిలు ఉన్న గుడ్డు ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. తాజాగా . అమెరికాలో డజను గుడ్ల ధర 6.23 డాలర్లకు చేరుకుంది. అంటే భారత కరెన్సీలో రూ. 536. మార్చి నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీలో గుడ్ల ధరను అమెరికా ప్రభుత్వం వెల్లడించింది.

గుడ్ల కొరత అంశం మరోసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది. గత కొన్నాళ్లుగా అమెరికాలో బర్డ్ ఫ్లూ విజ్రుంభిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాధి వ్యాప్తి కట్టడే లక్ష్యంగా కోట్లాది కోళ్లను వధించారు. దీంతో గుడ్ల కొరత విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లే డజను గుడ్ల ధర కొండెక్కి కూర్చొంది. ఫిబ్రవరిలో ఒక దశలో డజను గుడ్ల ధర ఏకంగా 7.34 డాలర్లకు పెరిగి మళ్లీ దిగివచ్చింది. ఇప్పుడది మళ్లీ 6 డాలర్లను దాటింది. ఈస్టర్ పండగ సందర్భంగా గుడ్లకు భారీగా గిరాకీ పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *