నాణ్యమైన విద్యను అందించేలా కృషి…
దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు ఇప్పటి నుండి కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాధికారీ ఎస్. యాదయ్య(District Education Officer S. Yadayya) పేర్కొన్నారు. ఆయన ఈ రోజు దండేపల్లి మండలంలోని వెల్గనూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఎస్ ఏ 1 పరీక్ష(SA 1 Exam)లో వచ్చిన మార్కులను పరిశీలించారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న తీరు పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు(quality vegetables), సరుకులు వాడాలన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోలిశెట్టి రాజన్న ఉన్నారు.

