Education | పిల్లలకు అధునాతన విద్య అందించాలి..

Education | పిల్లలకు అధునాతన విద్య అందించాలి..

ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అధునాతన విద్య అమలు చేయాలి
వీరి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు వేస్తుంది…

Education | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభః జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని వారికోసం నియమించబడిన ఉపాధ్యాయులు కష్టపడి వారికి విద్యా అవసరాలను తీర్చే యుద్దాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఉపవిద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ జిల్లా సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి లు పేర్కొన్నారు. దృష్టి ప్రోటల్ పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం డిప్యూటీ డీఈవో కాన్ఫరెన్స్ హాల్ యందు ఐ డి ఎస్ ఎస్ స్కూల్ అసిస్టెంట్లకు, ఐ ఈ ఆర్ టి హెచ్ ఐ, ఎమ్మార్ ఉద్యోగస్తులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో అధునాతన విద్యా విధానం అమలు చేయడానికి సమగ్ర శిక్ష రూపొందించిన దృష్టి ప్రోటల్ ప్రతి ఒక్కరు నేర్చుకుని మీ మండలాల్లో అమలు చేసి జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఈఓ అన్నారు.]


ఇప్పటినుండి భవిత కేంద్రాలలో ఐ ఈ ఆర్ టి లు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఐడిఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్లు సమగ్ర శిక్ష అందించిన ట్యాబులయందు ప్రత్యేక అవసర పిల్లల హాజరు, విద్య బోధన చేయాల్సి ఉంటుందన్నారు. ఐ డి ఎస్ ఎస్ స్కూల్ అసిస్టెంట్లకు, రెండో రోజు ఐఈ ఆర్టీ హెచ్ఐలకు, మూడో రోజు ఎం ఆర్ లకు ఈ ప్రోటల్ కు శిక్షణ ఇవ్వడానికి స్టేట్ రిసోర్స్ పర్సన్ గా జస్నా, బ్రీజిత్ మరియా అంటో రావడం జరిగింది అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని మండలంలో అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ మాధవిలత, ప్రత్యామ్నాయ పాఠశాల కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్, ఐఈ జిల్లా సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు, ఐ డి ఎస్ ఎస్ స్కూల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply